సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: నటి ఆమని
TG : తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు సావిత్రి కాలం నుంచే ఉన్నాయని, అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేకపోవడంతో అవి బయటకు వచ్చేవి కాదని సీనియర్ నటి ఆమని అన్నారు. తనకూ అసభ్యకరమైన డిమాండ్లు ఎదురయ్యాయని, వాటిని తిరస్కరించి అవకాశాలు వదులుకున్నానని వెల్లడించారు. తల్లి మద్దతుతో అలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నానని తెలిపారు.