రైళ్లలో రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్‌ బంద్‌!

రైళ్లలో పవర్‌ బ్యాంకులు పేలడం, షార్ట్‌ సర్క్యూట్‌లతో అగ్నిప్రమాదాలు జరగకుండా రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు బోగీల్లో ఛార్జింగ్‌ పాయింట్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డు ఆదేశించినట్లు సమాచారం. నిబంధనల అమలుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణానికి ముందే ఫోన్లు, పవర్‌ బ్యాంకులు ఛార్జ్‌ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.