విదేశీయుల వివరాల నమోదు తప్పనిసరి.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

వరంగల్‌ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, అద్దె గృహాల యజమానులు, విద్యా, వైద్య సంస్థల నిర్వాహకులు వారి రాకపోకల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ సూచించారు. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌–2025లోని సెక్షన్‌ 8 ప్రకారం, విదేశీ పౌరులు, ఓసీఐ కార్డుదారులు, నేపాల్‌, భూటాన్‌ దేశస్థులు సహా విదేశీయులు వచ్చిన లేదా వెళ్లిన 24 గంటల్లోపు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఫారమ్‌–III (గతంలో ఫారమ్‌–C) ద్వారా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్షన్‌ 23(బి) ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఉల్లంఘనకు వ్యక్తిగత, వాణిజ్య వసతి నిర్వాహకులకు...