ఏపీకి జల సిరులు.. తెలంగాణ రైతులకు కన్నీళ్లు!

TG : రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏపీకి జలహారతి దక్కుతుంటే తెలంగాణ రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలితో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఏపీలో క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి లేనప్పుడు తెలంగాణలో ఆ దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడే అవకాశం ఉందని ముందే హెచ్చరికలు వచ్చినా, నీటిని జాగ్రత్తగా వినియోగించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని నిలదీశారు. ముందుచూపు లేకుండా నీటిని దిగువకు వదిలేసి, ఇప్పుడు రైతులను పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.