కారు పైకప్పుపై కూర్చొని మద్యం సేవించిన యువతి.. వీడియో వైరల్
TG : రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ ప్రాంతంలో ఓ యువతి కదులుతున్న కారుపైకప్పుపై కూర్చొని మద్యం సేవించిన ఘటన కలకలం రేపింది. అదే మార్గంలో వెళ్తున్న మరో వాహనదారుడు తన డ్యాష్క్యామ్లో ఈ దృశ్యాలను రికార్డు చేసినట్లు సమాచారం. వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. కదులుతున్న వాహనంపై ఇలా ప్రయాణించడం ప్రమాదకరమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.