పులివెందులలో ఉద్రిక్తత.. పోలీసుల గాల్లోకి కాల్పులు!

AP : కడప జిల్లా పులివెందులలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారని, ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు పలువురు నేతలను నిలువరించారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. వైసీపీ నేతలు, కార్యకర్తల వాహనాలు ధ్వంసమయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.