దసరా, వీకెండ్‌ ఎఫెక్ట్‌.. టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌

TG : దసరా పండుగ, వారాంతపు సెలవుల ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ పెరిగింది. పోతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు ప్రయాణం నెమ్మదించింది. ఫాస్ట్‌ట్యాగ్‌లో సరిపడా బ్యాలెన్స్‌ లేకపోవడం, సాంకేతిక సమస్యలతో ట్రాఫిక్‌ జామ్‌ మరింత తీవ్రమైంది. పోలీసులు లక్కారం నుంచి వలిగొండ మీదుగా చిట్యాల వైపు వాహనాలను మళ్లిస్తున్నారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.