జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
అమరావతి : జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోదంతో రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు కలిపి 14 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. కార్పొరేషన్లు : ఏలూరు–రెడ్డి అప్పలనాయుడు, విజయవాడ–వంగవీటి రాధాకృష్ణ. మున్సిపాలిటీలు: అమలాపురం–నల్లా శ్రీధర్, చిలకలూరిపేట–తోట రాజరాజేశ్వరి, గొల్లప్రోలు–కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురం–కొత్తపల్లి శైలజ, నిడదవోలు–కల్లం జ్యోతి, పెడన–మట్టా శివపావని, పిఠాపురం–డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు–డి. ఏలుమలై, సాలూరు–గొర్లె విజయకుమారి, సామర్లకోట–పిట్టా జానకి రామారావు, తెనాలి–తోటకూర వెంకట రమణారావు, తిరువూరు–పి. మాధవి.