ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు.. ఎల్‌నినోతో ముప్పు!

HYD : ఎల్‌నినో ప్రభావంతో 2027 ఫిబ్రవరి నుంచే వేసవి తీవ్రత పెరిగే అవకాశం ఉందని క్లైమేట్‌ ట్రెండ్స్‌ అధ్యయన నివేదిక హెచ్చరించినట్లు సమాచారం. 2026 చివరి నాటికి ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరి, 2027లోనూ ప్రభావం చూపవచ్చని అంచనా. తెలంగాణలో 18 శాతం, ఏపీలో 25 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. భూగర్భ జలాలు తగ్గడం, రిజర్వాయర్లలో నీటి కొరతతో రబీ పంటల సాగుపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. వరి, చెరకు, పత్తి సాగు దెబ్బతినడంతో వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది.