ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా కన్నుమూత!
HYD : ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవనేసన్ చొక్కలింగం (75) కన్నుమూశారు. ‘దేవా’గా ప్రసిద్ధి చెందిన ఆయన 400కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంతో సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది.