వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తాం: శ్రీధర్‌బాబు

వరంగల్‌ : అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రజలను రక్షించాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. భూగర్భ జలాలు తగ్గకుండా ధర్మసాగర్‌ నుంచి భద్రకాళి చెరువుకు గోదావరి జలాలను తీసుకొస్తున్నామని చెప్పారు. వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేసి, ఐటీ టవర్ల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. త్వరలో సీఎం చేతుల మీదుగా కేయూ హబ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భద్రకాళి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందని, దాతల సహకారంతో రథోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.