ఎన్నికల డేటా లీక్‌.. ఇన్‌చార్జి ఎంపీడీవోపై చర్యలు

తిరుపతి : గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలకు ముందే పంచాయతీ ఎన్నికల డేటా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో తిరుపతి రూరల్‌ మండల ఇన్‌చార్జి ఎంపీడీవో మోతి పాత్ర ఉన్నట్లు గుర్తించి, ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించి శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఆయన స్థానంలో డిప్యూటీ ఎంపీడీవో దయాసాగర్‌ను నియమించారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లను పునఃపరిశీలించి సరిచేసిన జాబితాను కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం రిజర్వేషన్ల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, రిజర్వేషన్ల విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించడంపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.