1,500 మంది విద్యార్థులతో బతుకమ్మ.!

హైదరాబాద్‌: మల్లారెడ్డి యూనివర్సిటీలో 1,500 మంది విద్యార్థులతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా 65 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. సినీ నటి శ్రీలీల, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నటి శ్రీలీల, ప్రీతి రెడ్డి నృత్యాలతో సందడి చేసి వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు.