కోళ్లు కొనుగోలు చేస్తుండగా గుండెపోటు.. వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కోళ్లు కొనుగోలు చేస్తుండగా బెజవాడ శ్రీనివాస్‌ అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు సీపీఆర్‌ చేసి, చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రీనివాస్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.