ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్ షాక్.. రైతు మృతి..!
మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం దండు వంకుంట తండాలో ట్రాన్స్‌ఫార్మర్‌పై పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు విశ్లావత్ అనిల్ మృతి చెందాడు. రైతు ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి పనిచేస్తుండగా, కింద లైన్‌మన్ ఉన్నట్లు సమాచారం. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే అనిల్ మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో లైన్‌మన్‌పై దాడి జరిగినట్లు కూడా సమాచారం.