డీజీపీ సి.వి. ఆనంద్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ
TG : తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ను హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్ సిద్ధార్థ్ రామచంద్రన్, సీనియర్ ఫారిన్ సర్వీస్ నేషనల్ ఇన్వెస్టిగేటర్ వెంకట్ మర్యాదపూర్వకంగా కలిశారు. క్రికెట్‌పై డీజీపీకి ఉన్న ఆసక్తిని తెలుసుకున్న లారా విలియమ్స్.. అమెరికా కాన్సుల్ జనరల్ కార్యాలయం పేరు ముద్రించిన క్రికెట్ బంతిని బహూకరించారు. ఈ బహుమతిని అపురూపంగా దాచుకుంటానని డీజీపీ తెలిపారు. తెలంగాణలోని అమెరికా పౌరులు, సంస్థల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. భద్రతా వ్యవహారాల్లో సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో సమన్వయంతో చురుగ్గా పనిచేస్తారని డీజీపీ వివరించారు.