రాజమండ్రిలో రూ.19 లక్షల అక్రమ బాణసంచా పట్టివేత

రాజమండ్రి: నగరంలోని పాత అన్నపూర్ణ థియేటర్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న బాణసంచాను అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.19 లక్షల విలువైన బాణసంచాతో పాటు తరలింపునకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్‌ చేశారు. తమిళనాడులోని శివకాశి నుంచి విజయవాడకు చేరిన బాణసంచాను పెద్ద వాహనం నుంచి వేరు చేసి స్థానిక ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయానికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.