ఘనంగా హనుమకొండ జిల్లా ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు
హనుమకొండ: జిల్లా టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఐడీఓసీ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఆయన సతీమణి నీలిమ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఉద్యోగులు తమ శాఖల ప్రత్యేకతలను ప్రతిబింబించేలా బతుకమ్మలను రూపొందించడం అభినందనీయమన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.