హైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. కత్తితో నరికి వ్యక్తి హతం

హైదరాబాద్‌: నగరంలోని చిక్కడపల్లిలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానిక కిరాణా దుకాణం ముందు నిద్రిస్తున్న సుభాష్‌ (40) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తితో నరికి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.