పారా ఆసియా క్రీడలకు 166 మంది భారత అథ్లెట్లు

జపాన్‌లో ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందానికి కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. స్టార్‌ అథ్లెట్లు శీతల్‌ దేవి, అవని లేఖరా పోటీల్లో పాల్గొననున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న షూటింగ్‌ కోచ్‌ జై ప్రకాశ్‌కు జట్టులో చోటు దక్కలేదు. సైక్లింగ్‌లో అర్హత సాధించని వారిని కూడా అధికారులు ఎంపిక నుంచి తప్పించారు.