ఐదో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భద్రకాళి అమ్మవారు
వరంగల్ : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీ భద్రకాళి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.