మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించండి.... తాటికాయల రాజేందర్

జఫర్‌గడ్: అక్టోబర్ 14 (తెలంగాణ గొంతుక) స్టేషన్ ఘన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికాయల రాజేందర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు అని.మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడంతో, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తన సేవలను గుర్తించి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు అవకాశం కల్పిస్తారని రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.2012 నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని,తనపై కేసులు నమోదై జైలు జీవితం అనుభవించాల్సి వచ్చినప్పటికీ భయపడకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశానని పేర్కొన్నారు....