సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రాంకాకు 5 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రాంకాను కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. దీంతో పోలీసులు వారిని తీహార్‌ జైలుకు తరలించారు. అయితే, జంతర్‌ మంతర్‌ వద్దకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారంటూ పోలీసులు కోర్టులో చెప్పినది అవాస్తవమని, తాము ఎలాంటి పిలుపు ఇవ్వలేదని, బాండ్‌ నిబంధనలూ ఉల్లంఘించలేదని నేతల తరఫు న్యాయవాది వాదించారు.