వర్ధన్నపేటలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం

HNK : వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు కలకోట శ్రావణ కుమారాచార్యుల ఆధ్వర్యంలో సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.