ఒడిశాలో రెండు తలలతో కవల శిశువులు.. అరుదైన జననం!
HYD : ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో అక్టోబర్ 10న ఓ మహిళకు సిజేరియన్ ద్వారా రెండు తలలతో మగ కవల శిశువులు జన్మించారు. వారిని బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ అరుదైన పరిస్థితిని వైద్య పరిభాషలో ‘డైసెఫాలస్ పారాపాగస్’ అంటారు.