స్వీట్‌ బాక్స్‌ అడిగితే.. ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి!

HYD : తమిళనాడులోని మదురైకి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ వీరమణి దీపావళికి స్వీట్‌ బాక్స్‌ పంపాలని కోరుతూ తన అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేశాడు. కొందరు నెటిజన్లు ఆటపట్టించేందుకు భారీ వస్తువులను క్యాష్‌ ఆన్‌ డెలివరీలో ఆర్డర్‌ చేయడంతో వరుస డెలివరీలు, ఫోన్‌ కాల్స్‌తో ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు వేధింపులు భరించలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చిందని సమాచారం. సరదా పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టడంపై ఈ ఘటన చర్చకు దారితీసింది.