రిజర్వేషన్‌ ప్రకటనతో పెళ్లి.. భార్యకు టీడీపీ టికెట్‌ కోసం నేత ప్రయత్నం!

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం జిల్లాలో సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో టీడీపీ నేత హర్షవర్ధన్‌ తన భార్య మంజీరాను బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. తాను ప్రేమించిన మంజీరాను పెద్దలను ఒప్పించి, రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం భార్యకు టీడీపీ టికెట్‌ కోసం మాజీ కౌన్సిలర్‌ హర్షవర్ధన్‌ ప్రయత్నిస్తున్నారు.