బియ్యం ధరల బాదుడు.. ఎల్‌నినో సాకుతో పెంచుతున్నారా?

HYD : బియ్యం ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరుగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి దిగుబడులు, నిల్వలు పడిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు కొరత ఎలా వచ్చిందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. నిల్వలు, సరఫరా వ్యవస్థ, ధరల పెరుగుదలపై సమగ్ర విచారణ జరిపి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.