ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపికబురు.. ఒక్కో ఇంటికి అదనంగా రూ.72 వేలు!

HYD : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎం ఆవాస్‌ యోజనతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన 1.75 లక్షల ఇళ్ల వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. రెండో విడతలో మరో 25 వేల మంది లబ్ధిదారులను చేర్చనున్నారు. ప్రక్రియ పూర్తై కేంద్రం నుంచి నిధులు మంజూరైతే అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కో ఇంటికి రూ.72 వేల చొప్పున జమ కానున్నాయి.