ఎమ్మెల్యేల రాజీనామాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
HYD : టీవీకేలో చేరిన ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. రాజీనామాలను ఆమోదించే ముందు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం లేదా వివరణ కోరడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే, వారిపై పెండింగ్‌లో ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టం కేసులను రెండు నెలల్లోగా పరిష్కరించాలని స్పీకర్‌కు సూచించింది.