బోడుప్పల్లో అక్రమ మోటార్లపై విజిలెన్స్ దాడులు.. 9 మోటార్లు సీజ్!
HYD : వాటర్ బోర్డు నీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని ఈస్ట్ హనుమాన్ నగర్, హుడా లక్ష్మీనగర్‌లో విజిలెన్స్ బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించి 9 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మోటార్లతో ఇతర వినియోగదారులకు నీటి సరఫరా తగ్గుతోందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వాటర్ బోర్డు హెచ్చరించింది.