ఢిల్లీ విమానాశ్రయంలో రూ.35 లక్షల బంగారం స్వాధీనం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ యత్నాన్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి రెండు ట్రాలీ బ్యాగుల మూలల్లో వైర్ల రూపంలో దాచిన 241 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.35.21 లక్షలు ఉంటుందని అంచనా. కస్టమ్స్ చట్టం కింద బంగారాన్ని సీజ్ చేసి విచారణ చేపట్టారు.