భర్త హత్య కేసులో నిందితులు అరెస్ట్‌.. అండమాన్‌లో పట్టివేత

విశాఖపట్నం: భీమిలి పరిధిలో 2022లో జరిగిన ఫ్రిడిరాజు హత్య కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అరెస్ట్‌ చేశారు. మృతుడి భార్య జ్యోతి, నూకరాజు అలియాస్‌ శ్రీనివాసరావు అలియాస్‌ రాజ్‌కుమార్‌తో కలిసి హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని ఐటీ హిల్స్‌ ప్రాంతంలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు పేర్లు మార్చుకుని, నకిలీ ఆధార్‌ కార్డులతో అక్కడ తలదాచుకున్నట్లు డీసీపీ వి.ఎన్‌. మణికంఠ చందోలు తెలిపారు. పోలీసుల ప్రత్యేక బృందం వారిని అరెస్ట్‌ చేసి విశాఖకు తీసుకొచ్చింది. కేసు కోర్టులో విచారణలో ఉంది.