చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ

చెన్నై: చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలో భాగంగా పూనమల్లి బైపాస్‌ రోడ్డు నుంచి వడపళని మెట్రో స్టేషన్‌ వరకు నిర్మించిన ఎలివేటెడ్‌ మార్గంలో సేవలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.