బొల్లారంలో చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతం
సికింద్రాబాద్: బొల్లారంలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. క్లబ్‌హౌస్ సెల్లార్‌లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సెక్యూరిటీ గార్డు విక్రమ్ చిన్నారిని అనుసరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా చిన్నారి ఇంటి పరిసరాల్లో అతడు అనుమానాస్పదంగా తిరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.