వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ఎంపీ డాక్టర్ కడియం కావ్య
జనగాం ; అక్టోబర్ 10 పువ్వులను శివ పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి, ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల పూల పండుగను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలోని ప్రతి పువ్వులో అందాన్ని, ప్రతి జీవిలో జీవన సౌందర్యాన్ని దర్శించే గొప్ప పండుగ బతుకమ్మ అని...