పాత్రికేయుడు మహ్మద్‌ అజీజుద్దీన్‌కు ఘన సత్కారం

హనుమకొండ: పాత్రికేయ రంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మహ్మద్‌ అజీజుద్దీన్‌ను లయన్స్‌ క్లబ్‌ హనుమకొండ ఆధ్వర్యంలో ప్రెస్‌ క్లబ్‌లో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమాచార వారధిగా నిలుస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న పాత్రికేయుల సేవలను కొనియాడారు. అజీజుద్దీన్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.