ఎంగిలిపూల బతుకమ్మ.. పూల పండుగకు తొలి పూజ!
తెలంగాణ ప్రత్యేక కథనం: పూలను దేవుడికి సమర్పించడం ఒక సంప్రదాయం.. కానీ పూలనే దైవంగా భావించి పూజించడం తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేకత. అదే బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు సాగే ఈ పూల పండుగలో తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. పితృ అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఈ వేడుకతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు పూల పరిమళాలతో కళకళలాడుతాయి. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజిస్తూ పాటలు పాడి, ఆటలాడుతూ పండుగకు స్వాగతం పలుకుతారు. ‘ఎంగిలిపూలు’ పేరు వెనుక ఏముంది? ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వెనుక ప్రాంతానికో వివరణ, పెద్దలు చెప్పే సంప్రదాయ కథనాలున్నాయి. పండుగకు...