ప్రకృతిని పూజించే సంస్కృతి ప్రపంచంలో తెలంగాణలోనే ప్రత్యేకం : ఎస్‌ఆర్ జోనల్ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి
వరంగల్: ప్రకృతిని పూల రూపంలో పూజిస్తూ, పూలనే దైవంగా భావించి సంబరాలు చేసుకునే విశిష్ట సంస్కృతి తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీ ఎస్‌ఆర్ హైస్కూల్‌లో ముందస్తు వేడుకలను వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయినులు సంప్రదాయ దుస్తుల్లో చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రకృతే దైవం.. పూలే పూజా సామగ్రి.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది. తంగేడు, గునుగు, బంతి వంటి కాలానుగుణ పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజించడం...