బొడ్డెమ్మకు వీడ్కోలు...బతుకమ్మకు స్వాగతం..!

వర్ధన్నపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ వేడుకలు వర్ధన్నపేట పట్టణంలో వైభవంగా జరిగాయి. పట్టణంలోని రెండో వార్డు ఛత్రపతి శివాజీ నగర్‌లో మహిళలు, యువతులు కలిసి బొడ్డెమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. కాలనీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు. అనంతరం బొడ్డెమ్మను కోనారెడ్డి చెరువులో నిమజ్జనం చేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఎంగిలిపూల బతుకమ్మకు స్వాగతం పలుకుతూ మహిళలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ప్రకృతితో మమేకమయ్యే పండుగ... బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు తెలంగాణ ఆడపడుచుల జీవితాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. వర్షాకాలం ముగిసి, శరదృతువు ఆరంభమయ్యే సమయంలో ప్రకృతిలో విరబూసే పూలతో, మట్టితో ముడిపడిన ఈ వేడుకలు మన...