కే.ఆర్. నాగరాజు చొరవతో ప్రేమజంటకు పెళ్లి

వర్ధన్నపేట : ప్రియుడు శ్రీకాంత్‌తో వివాహం జరిపించాలని కోరుతూ నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న దళిత యువతి శ్రీదేవి దీక్షకు ఎట్టకేలకు ముగింపు లభించింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు చొరవతో శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు. దీంతో ఇరువర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీకాంత్–శ్రీదేవి వివాహం జరిగింది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే నాగరాజు ఇరువర్గాల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. కుటుంబాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి యువజంట భవిష్యత్తుకు భరోసా కల్పించేలా చర్చలు కొనసాగించారు. చివరకు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకారం తెలపడంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న శ్రీదేవి దీక్ష విరమించింది. అనంతరం శ్రీకాంత్–శ్రీదేవి పరస్పరం వివాహ...