ఒకే నంబర్‌తో పోలీస్, ప్రైవేట్ వాహనం
జగిత్యాల: పట్టణంలో పోలీస్ వాహనానికి కేటాయించిన TS 09 PA 3659 నంబర్‌తో ఓ ప్రైవేట్ స్విఫ్ట్ కారు తిరుగుతున్నట్లు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఆ కారుకు వెనుక భాగంలో ‘POLICE’ అనే బోర్డును ఏర్పాటు చేయడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2020 మార్చి 16న నమోదైన ఓవర్‌స్పీడ్ చలాన్‌లో ప్రైవేట్ కారు ఫొటోతో పాటు ఇదే పోలీస్ వాహనం నంబర్ నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ పోలీస్ వాహనం, ప్రైవేట్ వాహనానికి ఎలా ఉండేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి వాహన నంబర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.