శ్రీదేవి విజయం.. నాలుగు రోజుల పోరాటానికి తెర..! చైర్మన్‌ కుటుంబం దిగివచ్చిన వేళ

వర్ధన్నపేట: నాలుగు రోజులుగా వర్ధన్నపేటలో ఉత్కంఠ రేపిన దళిత యువతి తుమ్మల శ్రీదేవి పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తాను ప్రేమించిన పాలకుర్తి శ్రీకాంత్‌తోనే వివాహం జరిపించాలని పట్టువిడవకుండా ఆందోళన చేపట్టిన శ్రీదేవికి ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సబ్బండ వర్గాలు అండగా నిలిచాయి. ఈ వ్యవహారం స్థానికంగా మొదలై మీడియా కథనాలు, సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ కావడంతో రాష్ట్రస్థాయిలోనూ చర్చకు దారితీసింది. శ్రీకాంత్‌ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి చైర్మన్‌ కుటుంబం ఇంటి ఎదుట నాలుగు రోజులుగా దీక్ష కొనసాగించింది. రాత్రింబవళ్లు అక్కడే ఉంటూ తన డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. విషయం...