సజ్జనార్ ఫోటో డీప్‌ఫేక్.. తప్పుడు ప్రచారంపై హెచ్చరిక

హైదరాబాద్: ‘చుట్టమల్లె’ పాట మార్ఫింగ్ వీడియోకు సంబంధించి నకిలీ వార్తలు వైరల్ కావడంపై హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ స్పందించారు. ఏఐతో రూపొందించిన చిత్రాలు, డీప్‌ఫేక్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని హెచ్చరించారు. ఓ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ, సజ్జనార్ కూడా అరెస్ట్ అయినట్లుగా ఏఐ రూపొందించిన ఫొటోను ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేయగా, అది సీపీ దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ చిత్రాలను ప్రచారం చేయవద్దని సజ్జనార్ సూచించారు.