మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (PMUY) అమలు చేస్తోంది. అర్హులైన మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు స్టవ్, తొలి సిలిండర్‌ను అందిస్తున్నారు. PMUY 2.0 పథకాన్ని మరికొన్నేళ్లు పొడిగించాలని నిర్ణయించారు. కట్టెల పొయ్యిపై ఆధారపడే మహిళలకు LPG అందించడం లక్ష్యం. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏడాదికి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ లభిస్తుంది.