యువతి ఆందోళనకు ఈగ మల్లేశం సంఘీభావం

వర్ధన్నపేట : మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ గత మూడేళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు నిరాకరిస్తున్నాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. బాధిత యువతికి కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం సంఘీభావం తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని, బాధ్యులెవరైనా చట్టం ముందు సమానులేనని అన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.