ఏనుగు దాడిలో గాయపడ్డ మావటి మృతి
తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఆవరణలో ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన మావటి చంద్రశేఖర్ మృతిచెందారు. ఈ నెల 4న అమ్మవారి ఆలయ వేడుకల్లో టీటీడీకి చెందిన ఆస్థాన ఏనుగు శ్రీనిధి దాడి చేయడంతో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం.