నాలుగు శాఖల పరిధిలోని రికార్డులపై సమగ్ర సమాచారం కోరిన సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ*
*ఇంటి నెంబర్ 4-15 వ్యవహారంపై సీఎస్‌కు ఆర్టీఐ* స్టేషన్‌ఘన్‌పూర్,అక్టోబరు 7,(తెలంగాణ గొంతుక) ఇప్పుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఇంటి నెంబర్ 4-15 ఇంటి నంబర్‌కు సంబంధించిన వ్యవహారంపై సమగ్ర వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం–2005 కింద ఆర్టీఐ దరఖాస్తు సమర్పించినట్లు సమాచార హక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఇంటి నంబర్‌లో జరిగిన మార్పులు,పంచాయతీ రికార్డుల్లో నమోదైన వివరాలు,సంబంధిత ఫిర్యాదులు, గ్రీవెన్స్‌లు, పంచాయతీ కార్యదర్శి బదిలీ,పోలీస్‌స్టేషన్‌కు అందిన ఫిర్యాదులు,ఫోర్జరీ సంతకాలుగా పేర్కొన్న ఆరోపణలు,ఎంపీడీవో కార్యాలయం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై అధికారిక రికార్డుల ద్వారా వాస్తవాలను తెలుసుకునేందుకే ఈ సమాచారాన్ని కోరినట్లు పేర్కొన్నారు.ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం ఒక్క ప్రభుత్వ...