గుజరాత్‌ సీఎంగా తొలి అడుగు.. దేశ ప్రధానిగా వరుసగా మూడుసార్లు

న్యూఢిల్లీ : ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానిగా.. 25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2001 అక్టోబరు 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2014 వరకు దాదాపు 13 ఏళ్లపాటు సీఎంగా కొనసాగారు. అనంతరం 2014లో కేంద్ర రాజకీయాల్లోకి వచ్చి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2019లో రెండోసారి, 2024లో మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో గుజరాత్‌ 2001 భుజ్‌ భూకంపం, కరువు, తుపాన్లు, రాజకీయ అస్థిరత వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. గుజరాత్‌ పునర్నిర్మాణం, విద్యుత్‌, మౌలిక వసతులు, పెట్టుబడులు, వ్యవసాయ రంగంపై...