తమిళనాడు సీఎంకు వైఎస్ షర్మిల వివాహ ఆహ్వానం
చెన్నై: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన భర్త అనిల్‌కుమార్‌తో కలిసి చెన్నైలో సీఎంను కలిసిన షర్మిల.. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా విజయ్‌తో భేటీ కావడం ఆనందంగా ఉందని షర్మిల తెలిపారు. వివాహ వేడుకకు హాజరు కావాలని వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.